Friday, December 20, 2024

బిఆర్‌ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

- Advertisement -
- Advertisement -

పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలు
ఏప్రిల్‌లో పారటీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి
కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి: సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ పార్టీపై తప్పుడు కథనాలను సహించేది లేదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. గురువారం మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ లో గోకులం కళ్యాణ మండపంలో పార్టీ అద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.

పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేదా తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఏప్రిల్ లో జరగబోయే పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా అద్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జి బస్వరాజ్ సారయ్య పాల్గొంటారని ఈ సమ్మేళనం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ రాజయ్య, స్ధానిక సర్పంచ్ టేకు తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు శ్రీనివాస్ గుప్తా, లక్ష్మన్ ,శేఖర్ బాబు, బోనగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News