Sunday, December 22, 2024

అంతా సమానం..ఎవరూ తక్కువ కాదు:చైనా

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : ఎవరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం తమ దేశ నైజం కాదని చైనా అధికారికంగా ప్రకటించింది. మాల్దీవులు, ఇండియా మధ్య ఇప్పుడు వివాదం నెలకొనడం, ఇదే దశలో మాల్దీవుల అధ్యక్షుల చైనా పర్యటన నేపధ్యంలో చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో ఇండియా, మాల్దీవలతో చైనా సంబంధాల గురించి చాలా జాగ్రత్తగా స్పందించారు. మాల్దీవుల సార్వభౌమాత్వాన్ని చైనా ఎప్పుడూ గౌరవిస్తుంది. సమాన భాగస్వామ్యపక్షంగా ఈ దేశానికి ఉండే విలువ ఉండనే ఉంటుందని సంపాదకీయంలో తెలిపారు. సోమవారమే చైనా అనుకూల మాల్దీవుల అధినేత ముయిజూ ఐదురోజుల పర్యటనకు వచ్చారు.

చైనా ఎప్పుడూ దక్షిణాసియా సమస్యలపై పారదర్శకతతో వ్యవహరిస్తుందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అంతేకాకుండా ఒకదేశంతో స్నేహం కోసం మరో దేశాన్ని కాదనడం చైనాకు ఇష్టం లేదని పేర్కొన్నారు. మాల్దీవులు , ఇండియా మధ్య స్నేహపూరిత, సహకార సంబంధాలు కొనసాగుతూ ఉండాలనేదే చైనా ఆలోచన అని సంపాదకీయంలో విశ్లేషించారు. భారత్ చైనా నడుమ వివాదాస్పద అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మాల్దీవులను కానీ ఇతర దేశాలను కానీ తాము ఎప్పుడూ ఇండియాకు వ్యతిరేకంగా స్పందించాలని సూచించలేదని, ఇది తమ దేశ విధానం కానే కాదని చైనా స్పష్టం చేసింది. మాలే తమ బాటలోకి రావాలనే సంకేతాలు తాము ఎప్పుడూ వెలువరించలేదని గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్‌లో రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News