Monday, January 13, 2025

ఇంటి అద్దె విషయంలో వివాదం…

- Advertisement -
- Advertisement -

Dispute over house rent in Gachibowli

హైదరాబాద్:  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళి కృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గచ్చిబౌలిలో ఉన్న ఒక విల్లా యజమాని ఫిర్యాదు మేరకు మంగళ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళి కృష్ణ  ఏడాది కాలం నుంచి విల్లాలో నివాసం ఉంటూ అద్దె చెల్లించకపోవడంతో యజమాని, కృష్ణ మధ్య గొడవ జరిగింది. మంగళి కృష్ణ ఇంటి అద్దెను అడిగిన శివ ప్రసాద్ రెడ్డిని బెదిరించారు. మంగలి కృష్ణపాటు అతని అనుచరులు తనపై దాడికి పాల్పడరంటూ పోలీస్ స్టేషన్ లో శివ ఫిర్యాదు చేశారు.

మంగళి కృష్ణ పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలిపిన గచ్చిబౌలి సిఐ సురేష్ తెలిపారు. విల్లా యజమాని శివ ప్రసాద్ రెడ్డికి మంగళి కృష్ణ అద్దె చెల్లిపుల విషయంలో చిన్న వివాదం తలెత్తింది. శివ ప్రసాద్ రెడ్డి, మంగళి కృష్ణ ఇద్దరు పాత మిత్రులేనని తెలిపారు.  పోలీస్ స్టేషన్ లో శివ ప్రసాద్ రెడ్డి ,మంగళి కృష్ణ రాజీ కుదుర్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News