కస్టమర్లకు ఇబ్బందులు
వెల్లువెత్తిన ఫిర్యాదులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సేవలకు అంతరాయం ఏర్పడిం ది. ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఎస్‌బిఐ యోనో యాప్ తెరిచేందుకు ప్రయత్నించినప్పుడు మెయింటెనెన్స్ వల్ల సేవలకు అంతరాయం ఏర్పడుతోందనే మెసేజ్ వచ్చింది. గురువారం మధ్యా హ్నం నుంచి ఎస్‌బిఐ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆన్‌లైన్ ద్వారా డబ్బులను బదిలీ చేసే సమయంలో సమస్యలు ఎదురవడంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేశారు. యుపిఐ విషయం లో సమస్యలు ఎదుర్కొన్నామని, అంతేకాదు ఎటిఎం కేంద్రాల్లో నగదు విత్‌డ్రా కూడా జరగలేదని కస్టమర్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుం చి ఫిర్యాదు పెద్దఎత్తున వ చ్చాయని డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ సమయంలో ఎస్‌బిఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.