Sunday, September 22, 2024

శ్రీలంక తదుపరి అధ్యక్షుడిగా దిస్సనాయకే!

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ట్రెండ్స్ ప్రకారం నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) నేత అనుర కుమార దిస్సనాయకే (55) ముందంజలో ఉన్నారు. ఆయనే కనుక విజయం సాధిస్తే తొలి వామపక్ష దేశాధినేతగా రికార్డులకెక్కుతారు. ప్రస్తుతం ఉన్న లీడ్స్ ఇలాగే కొనసాగితే దిస్సనాయకే శ్రీలంక 9వ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఇటీవల దేశంలో సంభవించిన ఆర్థిక సంక్షోభం తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నిక కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత, సమగి జన బలవేగయ (ఎస్‌జెబి)కి చెందిన నేత సజిత్ ప్రేమదాస, జనతా విముక్తి పేరమున పార్టీకి చెందిన మార్క్సిస్ట్ నేత, అనుర కుమార దిస్సనాయకే సహా మొత్తం 39 మంది అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News