Wednesday, January 22, 2025

నేషనల్ హైవే డ్రైనేజీల నిర్మాణంపై అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజి వాడి చౌరస్తా వద్ద 44 వ జాతీయ రహదారిపై బ్రిడ్జీ నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయి. ప్రధాన జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ పెరుగుతోంది. బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ మధ్యలో ప్రధాన కుడలిగా పద్మాజి వాడి చౌరస్తా ఉంది.

ఈ చౌరస్తా పెద్ద జంక్షన్‌గా మారడం వల్ల ఇక్కడ ప్రమాదాలను అరికట్టడానికి నేషనల్ హైవే అథారిటి వారు జంక్షన్ వద్ద బ్రిడ్జీ నిర్మాణం చేపట్టారు. అయితే బిడ్జీ నిర్మా ణంలో భాగంగా ముందుగా రెండు వైపులా సర్వీస్ రోడ్లను ఏర్పా టు చేస్తున్నారు. రెండు వైపులా సర్వీస్ రోడ్లకు ఒక పక్కనే డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నారు.

సర్వీస్ రోడ్డుకు మరోపక్కన డ్రైనేజీ నిర్మాణంపై నేషనల్ హైవే అధికారులు స్పష్టత ఇవ్వకుండా పనులు కొనసాగిస్తుండ టంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వైపు డ్రైనేజీ నిర్మాణంతో భవిశ్యత్తులో పద్మాజివాడి చౌరస్తా తో పాటు గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుయాని చెప్పారు.దీనిపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News