Monday, December 23, 2024

హస్తంలో అసమ్మతి మంటలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  టికాంగ్రెస్‌లో రెండో జాబితా వెలువడడంతో ఆ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు ఆశావహులు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టికెట్ రాని పలువురు ఆశావహులు ఒక్కొక్క రు ఒక్కో విధంగా తమ ఆగ్రహాన్ని కాంగ్రెస్‌పై చూపిస్తున్నారు. అందులో భాగంగా జూబ్లీహి ల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి అ నుచరులు ఏకంగా గాంధీభవన్‌పై దాడి చేయడంతో పాటు పార్టీ జెండాలను తగులబెట్టారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఱొండోవిడత జాబితాలో 45 స్థానాలకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా ఆ స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడి న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ చాలా కాలంగా పని చేస్తున్న తమను కాదని ఇతరులకు బరిలోకి దించాలన్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో అనేక చోట్ల టికెట్ దక్కని అసంతృప్త నేతలు అత్యవసరంగా తమ ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నా రు. వారితో చర్చించి భవిష్యత్ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జిహెచ్‌ఎంసి పరిధితో పాటు పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పలువురు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ నేతల రాజీనామాలు కాంగ్రెస్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చే స్తున్నా పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ము గ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. అయితే నేతల అసంతృప్తులు ఇలా కొనసాగుతుంటే అధిష్ఠానం మాత్రం సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించామని చెబుతోంది. మొదటి జాబితాపై అసంతృప్తులు చల్లారుతున్న తరుణంలో రెండో జాబితా విషయంలో అదే సీన్ కంటిన్యూ కావడం విశేషం.

అసంతృప్తులతో భేటీ కానున్న డికె శివకుమార్
అధిష్టానం ప్రకటించిన 45 స్థానాల్లో దాదాపు సగానికి పైగా స్థానాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఫోర్ మెన్ కమిటీ ఇప్పటికే కొంత మంది అసంతృప్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చెబుతూ సర్దిచెబుతున్నట్లు సమాచారం. రెండో జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల్లో జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్, అంబర్‌పేట నుంచి లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్, మోతె రోహిత్, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, సిద్దిపేట నుంచి భవానీరెడ్డి, ఆదిలాబాద్ నుంచి గండ్రత్ సుజాత, షాజీద్ ఖాన్, ఆసిఫాబాద్ నుంచి సరస్వతి, మక్తల్ నుంచి ఎర్ర శేఖర్, వనపర్తి నుంచి శివశంకర్ రెడ్డి, మేఘారెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, పరకాల నుంచి గాజర్ల అశోక్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కొండా మురళి, మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి, పొన్న కైలాష్, పినపాక నుంచి సూర్యం, వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి, మహేశ్వరం నుంచి పారిజాతారెడ్డి, దేవరకొండ నుంచి వడ్త్యా రమేష్ నాయక్, భోథ్ నుంచి రాథోడ్ బాపురావు, శేరిలింగంపల్లి నుంచి జైపాల్, రఘునాథ్ యాదవ్, కంటోన్మెంట్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఇబ్రహీం పట్నం నుంచి దండెం రామిరెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి నగేష్‌రెడ్డి ఉన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న పలువురు ఆశావహులు
తాజాగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ గుడై చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సీటును ఆయన ఆశించారు. కానీ రెండో జాబితాలో మదన్ మోహన్‌కు టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ సందర్భంగా టికెట్ దక్కనం దుకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుచరుల ముందు బోరును ఏడ్చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక వరంగల్ వెస్ట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జంగా రాఘవరెడ్డి కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కనందుకు ఆయన కార్యకర్తల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. మునుగోడు టికెట్ ఆశించి భంగపడిన చలమల కృష్ణారెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంటి పోటీకి దిగబోతున్నట్లు ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. జడ్చర్ల, నారాయణపేట్‌లో టికెట్ కోసం ఎర్ర శేఖర్ ప్రయత్నం చేయగా, గాలి అనిల్ నర్సాపూర్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు.
మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో గుర్తింపు లేదు: నగేష్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించిన టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ మేనమామ నగేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా గుర్తింపు లేదని, పార్టీ ఇక ఎదుగలేదని, లాబీయింగ్‌కు తలొగ్గి టికెట్లు కేటాయించారని ఆరోపించారు. తన కోసం హీరో నితిన్ (అల్లుడు) కూడా ప్రయత్నం చేశాడని, టికెట్ వస్తే ప్రచారం కూడా చేస్తానని మాటిచ్చాడని ఆయన తెలిపారు. నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించగా ఆ టికెట్‌ను కాంగ్రెస్ హైకమాండ్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కేటాయించింది. కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో టికె ట్ చిచ్చు రేపింది. ఆదివాసీలకు అన్యాయం చేశారంటూ టికెట్ ఆశించిన మర్సు కోల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ అమ్ముకున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ మోసం చేశారని ఆరోపించారు. టికెట్ తెచ్చుకున్న శ్యాంనాయక్ ఎలా గెలుస్తాడో చూస్తామని హెచ్చరించారు. టిపిసిసి జనరల్ సెక్రటరీతో పాటు మరో పదవికి రాజీనామా చేస్తున్నట్టు మర్సుకోల సరస్వతి తెలిపారు.
గాంధీ భవన్‌లో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల రచ్చ…
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ టికెట్ గాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే పార్టీలో టికెట్లు ఇచ్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకే టికెట్ ఇస్తానని మాణిక్‌రావ్ ఠాక్రే కూడా చెప్పారని, తీరా జాబితాలో తన పేరు లేక పోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ నేప థ్యంలోనే శనివారం సాయంత్రం గాంధీభవన్ వద్దకు భారీగా చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి అబిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ ఫొటోలను చింపేశారు. పార్టీ జెండాలను తగులబెట్టారు. ఇటుకలు, రాళ్లను గాంధీభవన్‌పైకి విసిరారు. విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల ఆందోళనతో గాంధీభవన్ దద్దరిల్లింది.
మైనారిటీ డిపార్టమెంట్ చైర్మన్ సోహెల్ రాజీనామా
మైనారిటీ డిపార్టమెంట్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి ఎన్నిమిది పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖ రాశారు. 34 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన తాను ఎంతో బాధతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొ న్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను రేవంత్ చంపేశారని ఆరోపించారు. కూకట్ పల్లి టికెట్ ఆశించిన నిరాశకు గురైన గొట్టిముక్కల వెంగళరావు సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శేరిలింగంపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌యాదవ్ ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీ తనను మోసం చేసిందని త్వరలోనే పార్టీ మారతానని ఆయన తెలిపారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News