Friday, January 17, 2025

17వ లోక్‌సభ రద్దు

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ బుధవారం 17వ లోక్‌సభను రద్దు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఫలితాల అనంతరం పరిసమాప్తం అయింది. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యపు కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసినట్లు రాష్ట్రపతిభవన్ వర్గాలు ఆ తరువాత అధికారిక ప్రకటన వెలువరించాయి. బుధవారం మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. తక్షణమే సభను రద్దు చేయాలని, రాజ్యాంగయుతంగా తదుపరి సభ ఏర్పాటుకు వీలు కల్పించాలని పేర్కొంటూ కేబినెట్ సలహా వెలువరించింది.

దీనిని రాష్ట్రపతి ఆమోదించారని , రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 అధికరణల ప్రకారం తమకు సంక్రమించిన అధికారాల మేరకు సభ రద్దు అయిందని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత లోక్‌సభ గడువు ఈ నెల 16తో ముగుస్తుంది. ఈ లోగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. బుధవారం ఉదయం ప్రధాని మోడీ రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి తమ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమోదించిన రాష్ట్రపతి తదుపరి ప్రభుత్వ ఏర్పాటు అయ్యేవరకూ పదవిలో ఉండాలని మోడీకి సూచించారు. ఈ దశలో మోడీ ఆపద్ధర్మ ప్రధాని అయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎకు మెజార్టీ స్థానాలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News