Monday, January 20, 2025

కాలపరిమితి ముగిసిన పలు జిల్లాల టీఎన్జీవో కార్యవర్గాల రద్దు 

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నగర టీఎన్జీవో సంఘం, సంగారెడ్డి, నారాయణపేట్, ఆసిఫాబాద్ జిల్లాల టీఎన్జీవో యూనియన్ల కార్యవర్గాలు రద్దయ్యాయి. వాటి కార్యవర్గాల మూడేళ్ల కాలపరిమితి గడువు ముగిసాయి. ఈ మేరకు తాత్కాలికంగా ఉద్యోగులతో కూడిన అడ్‌హక్ కమిటీలు నియమించారు. సంఘం నిబంధనల ప్రకారం త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ వెల్లడించారు. మంగళవారం నాంపల్లిలో తెలంగాణ ఉద్యోగభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా టీఎన్జీవో కార్యదర్శినొ నియమించుకోవాలని జిల్లా అధ్యక్షుడ్ని ఆదేశించామన్నారు. ఆయా జిల్లాలకు త్వరలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇటీవలే టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సారధ్యంలో విస్తృత కార్యవర్గ సమావేశంలో జిల్లాల కార్యవర్గాల రద్దు సభ్యుల ఏకాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

నగర టీఎన్జీవో సంఘాన్ని రద్దు చేశామని, ఇంకా అధ్యక్షుడిగా తనకు తాను చెప్పుకుంటున్న ఎస్.శ్రీరాంకు ఇక నుంచి సంఘంలో ఎలాంటి అధికారం ఉండదని, అతను మాజీ అని పేర్కొన్నారు. సిటీ టీఎన్జీవో కార్యదర్శి కె.శ్రీకాంత్‌ను సస్పెండ్ చేసే అధికారం శ్రీరాంకు లేదని, కార్యవర్గ సమావేశం ఏర్పాటు వంటివి కూడా చెల్లదని స్పష్ఠత ఇచ్చారు. సిటీ టీఎన్జీవో కొత్తగా పలువురు సభ్యులతో కూడిన అడ్‌హక్‌కమిటీని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నియమించారని మారం జగదీశ్వర్ తెలిపారు. సిటీ టీఎన్జీవో కార్యదర్శి కె.శ్రీకాంత్‌ను సస్పెండ్ చేయాలంటే 70 వరకు హెచ్‌ఓడీల అధ్యక్షులు, కార్యదర్శుల మద్దతు అవసరమని, ఆలా చేయకుండానే ఏకపక్షంగా ఆతన్ని తొలిగిస్తున్నట్లు ప్రకటించడం చెల్లదని ఆయన వివరించారు.

టీఎన్జీవో కేంద్ర సంఘం సహాధ్యక్షుడు,సీనియర్ నాయకులు కాస్తురి వెంకటేశ్వర్లు, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు జి. శ్రీనివాస్ గౌడ్ సస్పెన్షన్ చేసే అధికారం సిటీ టీఎన్జీవోకి లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ అధికారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడికి మాత్రం ఉంటుందని స్పష్ఠం చేశారు. ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు కాస్తురి వెంకటేశ్వర్లు, జి. శ్రీనివాస్ గౌడ్‌లు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను కలిసి తాము టీఎన్జీవోకి వ్యతిరేకంగా ఏనాడు కూడా వ్యవహరించలేదని, క్రమశిక్షణను ఎక్కడ ఉల్లంఘించలేదని, టీఎన్జీవో కేంద్ర సంఘానికి విధేయులుగా పనిచేస్తామంటూ తమ వివరణ ఇచ్చుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన రాజేందర్‌లు వారు యధావిధిగా టీఎన్జీవో కేంద్ర సంఘంలో కొనసాగవచ్చని అభయమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News