మనం ఆర్యోగంగా ఉండాలంటే ప్రతి రోజు వాకింగ్ చేయాల్సిందే. దీని వలన మెరుగైన గుండె ఆరోగ్యం నుండి మానసిక ఆరోగ్యం వరకు ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఎంతో వ్యాయామం సులభం, అనుకూలమైనది అని చెప్పవచ్చు. వాకింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. వాకింగ్ అనేది అన్ని వయసుల వారికి అనువైన సులభమైన, తక్కువ ప్రభావం చూపే కార్యకలాపం. ఇది ప్రతి వ్యక్తి తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలో ఏ వయస్సులో ఎవరు ఎంత వాకింగ్ చేయాలో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
18-30 సంవత్సరాలు
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దాదాపు ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాల వాకింగ్ చేయాలి. ఎక్కువ సేపు నడవడం వల్ల వారి గుండె ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చేసే పని మీద వారి దృష్టి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది.
31-50 సంవత్సరాలు
ఈ వయస్సులో ఉన్నవారు ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు పాటు ఖచ్చితంగా నడవాలి. రోజూ ఇంత సమయం నడవడం వారి ఆరోగ్యానికి సరిపోతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ వాకింగ్ వారి కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతుంది. ఈ వయస్సులో ఉన్నవారు వాకింగ్ చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నుండి ఉపశమనం పొందుతారు.
51-65 సంవత్సరాలు
ఇది జీవితం మధ్యవయస్సు దశ అని చెప్పవచ్చు. ఇది కొత్త వ్యాధులను ఆహ్వానిస్తూ పాత వ్యాధులను తిరిగి క్రియాశీలం చేస్తుంది. ఈ వయస్సు వారికి ఎముకలు, కండరాలలో నొప్పి పెరగడం, బలహీనమైన జీవక్రియ మొదలైన సమస్యలు ఉంటాయి. ఈ వయస్సులో ఉన్నవారు రోజూ నడవాలి. తద్వారా ఎముకలు, కీళ్లలో రాపిడి సమస్య ఉండదు. రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు నడవడం వారికి మేలు చేస్తుంది.
66-75 సంవత్సరాలు
వృద్ధులు ప్రతిరోజూ దాదాపు 20 నుండి 30 నిమిషాలు నడవాలి. ఈ వయస్సులో ఉన్న వ్యక్తులు మితమైన వేగంతో నడవాలి అని గుర్తించుకోవాలి. ఎందుకంటే? ఎక్కువసేపు లేదా వేగంగా నడవడం వల్ల శ్వాసలోపం ఏర్పడుతుంది. క్రమం తప్పకుండా నడవడం అనేది వృద్ధులకు వారి రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు.
75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు
ఈ వ్యక్తులు ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాలు నెమ్మదిగా నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ, కండరాల బలం, శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో రెగ్యులర్ చిన్న నడకలు సహాయపడతాయి.