Monday, December 23, 2024

జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ చేప ప్రసాందం పంపిణీ చేయనున్నట్టు బత్తిన సోదరులు తెలిపారు. జూన్ 9న మృగశిర కార్తే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కరోనా వల్ల గత మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిలిపి వేశారు. ఈ ఏడాది మళ్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా పలు దేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తారని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రసాదం పంపిణీకి అవసరమైన చేపపిల్లలను మత్సశాఖ ద్వారా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుందని , ఈ నెల 25న ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుందని బత్తిన సోదరులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News