Thursday, January 23, 2025

రాష్ట్రవ్యాప్తంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లాల్లో మట్టి గణనాథుల విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి మట్టి వినాయక విగ్రహాన్ని ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి గణేష్ విగ్రహాలను ఈ ఏడాది రెండు లక్షలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాలతో పాటు జిహెచ్‌ఎంసి పరిధిలో పిసిబి ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. అనేక సంస్థలు మట్టి గణనాథుల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. పర్యావరణ గణనాథుల కోసం సోషల్ మీడియాతో పాటు ఆటో ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News