వాసాలమర్రిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి
యావత్ ప్రపంచానికే దళితబంధు ఓ రోల్ మోడల్ సిఎం కెసిఆర్ సాహసోపేత నిర్ణయానికి నిదర్శనం : జగదీశ్‌రెడ్డి
సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎంఎల్‌సి ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్‌పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మన తెలంగాణ/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: దళితబంధు’ పథకం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ’దళితబంధు’ పథకం కింద 10 కుటుంబాలకు యూనిట్లను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా దళిత బందు లబ్ధిదారులకు, ఏడు గూడ్సు వాహనాలు, రెండు డోజర్లు, ఒక ప్యాసింజర్ ఆటోను లబ్ధిదారులకు మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో డ్రైవర్లుగా ఉన్నవారు‘దళితబంధు’ పథకంతో ఓనర్లుగా మారారని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ పేరు దేశంలోనే మార్మోగుతోందని, కోటి ఎకరాల మాగాణి కల నెరవేరి ఆకుపచ్చ తెలంగాణగా మారిందన్నారు. సీఎం మేధస్సు నుంచి వచ్చిన ’దళితబంధు’ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపి రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జగదీష్‌రెడ్డి అన్నారు.
దళిత తెలంగాణ కోసం దళిత రూపంలో అడుగులు పడ్డాయని ఆయన తెలిపారు. దళితబందు కేవలం కుటుంబానికో పది లక్షలు ఇచ్చే పధకం ఎంత మాత్రం కాదని ఈ ప్రపంచానికి గొప్ప మార్గదర్శనంగా నిలబడే పధకంగా రూపొదిద్దు కుంటుందని ఆయన అన్నారు. తెలంగాణా సాధన కొరకు ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలను కేంద్రంగా మార్చి 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించారో అదే పద్దతిలో దళితబందు పథకాన్ని ప్రపంచానికే ఓ రోల్ మోడల్ పథకంగా రూపొందించారని ఆయన చెప్పారు. ఇది ప్రగతిశీల ప్రభుత్వం అని అన్నివర్గాలను ఒప్పించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కుందని ఆయన పేర్కొన్నారు. భిన్న వైరుధ్యాలతో ఉండే సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతూ ఆచరణలో దళితబందు పథకాన్ని విజయవంతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.బాబా సాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్ఫూర్తిదాయకమన్నారు.భారతదేశంతో పాటు మరెన్నో దేశాలకు స్వతంత్రం సిద్దించినా అనతి కాలంలోనే ఎన్నో దేశాలు చిన్నా బిన్నం అయ్యాయన్నారు.
భారతదేశం ఇప్పటికి నిలదొక్కుకున్నది అంటే అందుకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. అందుకే మహాత్మాగాంధీ, అంబేద్కర్ ల కలల సాకారానికై ముఖ్యమంత్రి కేసీఆర్ తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అన్నార్తులు,అనాధాలు లేనిఅద్భుతమైన సమాజం నిర్మాణానికి పునాదులు వేస్తున్నారన్నారు.అందులో భాగమే దళితబందు పధకమని తద్వారా ఆర్థిక వెనుకబాటుతనం తో పాటు సామాజిక అంతరాలు రూపొందించేందుకు బ్రహ్మ ష్ట్రం లా ఉపయోగ పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అన్నింటినీ పటాపంచలు చేయడమే కాకుండ వచ్చిన తెలంగాణా లో తిరుగులేని ప్రజాభినంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనా దక్షుడిగా యావత్ భారతదేశంలో కీర్తింప బడుతున్న శుభసందర్బం లో మొదలు పెట్టిన పదకమే దళిత బంధు అని ఇది నిర్విరామంగా ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ కార్య్క్మ్రంలో క్లెక్ట్ ప్మేలా స్త్ప్తి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునితమహెందర్ రెడ్డి, జిల్లా చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేష్న్ ఈడీ శ్యాంసుంద్,్ర గ్రామ స్ప్రంచ్ ఆంజ్నేయులు, ఎంపీటీసీ న్వీన్‌తో పాటు తుర్కపల్లి మండల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, ప్లువురు లబ్ధిదారులు, పాల్గొన్నారు.