Monday, December 23, 2024

మరో 3 నెలలు ఉచిత బియ్యం

- Advertisement -
- Advertisement -

Distribution of 10 kg of free rice per person

మనతెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మరో విడత మనిషికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు, 283.42 లక్షల లబ్ధిదారులున్నారని.. వీరిలో కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుం దన్నారు, వీరికి అదనపు బియ్యంతో పాటు మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుందని మంత్రి గంగుల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరో విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల కాలానికి పిఎంజికెఎవై పథకా న్ని పొడిగించిందని ఇందుకోసం కేవ లం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. వీటికి నెలకు 75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అదనంగా 227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందన్నారు. పిఎంజికెఎవై మొదలైనప్పటి నుంచి అదనంగా 25 నెలలకు రూ.1308 కోట్లు ఖర్చు కేవలం బియ్యం కోసం చేశామని, ఇవే కాకుండా వలసకూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1500 చొప్పున రెండు నెలలు అందజేసిన వ్యయం 2,454 కోట్ల రూపాయలన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయంతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం తింటున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News