Sunday, November 17, 2024

ఆస్పత్రులకు నాజిల్ కరోనా టీకా 3 లక్షల డోసుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముక్కు ద్వారా ఇచ్చే నాజిల్ కరోనా టీకా 3 లక్షల డోసులను వివిధ ఆస్పత్రులకు రెండు రోజుల క్రితం భారత్ బయోటెక్ సంస్థ పంపించింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్రిష్ణ ఎల్లా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. బెంగళూరులో ప్రప్రథమంగా యూనివర్శిటీ ఆఫ్ విస్కన్సిన్ మేడిసన్ వన్ హెల్త్ సెంటర్‌ను నెలకొల్పనున్న సందర్భంగా యూనివర్శిటీ ఆఫ్ విస్కన్సిన్ (యుడబ్లు)మేడిసన్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ (జిహెచ్‌ఐ),ఎల్లా ఫౌండేషన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఎల్లా మాట్లాడారు. ఈ నాజిల్ కరోనా టీకా ప్రపంచం లోనే మొట్టమొదటి టీకా (ఇంకోవాక్) జనవరి 26 న ఆవిష్కరణ అయింది. కొవిన్ (సిఒడబ్లుఐన్) ద్వారా ఇప్పుడు ఈ టీకా అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ మార్కెట్‌కు రూ.800.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325 వంతున ధర నిర్ణయించారు.

అయితే విదేశాలకు కూడా ఈ టీకా డోసులను ఎగుమతి చేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఈ టీకా కోసం కొన్ని దేశాలు, అంతర్జాతీయసంస్థలు తమ సంస్థను సంప్రదిస్తున్నాయని ఎల్లా తెలిపారు. బెంగళూరులో ఏర్పాటవుతున్న హెల్త్ సెంటర్ ఈ ఏడాది ఆఖరులో ఆపరేషన్ ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ సెంటర్ ద్వారా భారత్‌కు అవసరమయ్యే మరి కొన్ని కొత్త టీకాల ఉత్పత్తి కోసం పరిశోధనలు, అభివృద్ధి జరుగుతాయని ఎల్లా తెలిపారు. భారతీయ విద్యార్థులు, పరిశోధకులకు యూనివర్శిటీ ఆఫ్ విస్కన్సిన్‌తో అనుసంధానం ఏర్పడి నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుందని వివరించారు. ఎల్లా ఫౌండేషన్‌తో తాము భాగస్వామ్యం పొందడం మరింత శక్తిని పొందినట్టయిందని, విస్కన్సిన్ నుంచి భారత్‌కు యూనివర్శిటీ ఆప్ విస్కన్సిన్ శాస్త్రజ్ఞానం వ్యాప్తి చెంది కొత్త ఆవిష్కరణలకు, పరిశోధనలకు అవకాశాలు చాలా లభిస్తాయని యుడబ్లుమేడిసన్ జిహెచ్‌ఐ డైరెక్టర్ జోర్గె ఒసోరియో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News