Sunday, January 19, 2025

నిరుద్యోగ యువతకు 30 ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ, యువకులకు ఈటిఓ మోటర్స్ 30 ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా సమకూర్చింది. శనివారం ఎంఐఎం కేంద్రకార్యాలయం దారుస్సలాంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్ ఓవైసి చేతుల మీదుగా అర్హులైన నిరుద్యోగులకు అందజేయడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 100 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి నిమిత్తం 100 ఆటోలను అందజేయాలని ఎంఐఎం పార్టీ లక్షంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసి అన్నారు. ఎంఐఎం సహకారంతో ఈటిఓ మోటార్స్ ఎలక్రిటక్ వాహనాలను అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ రెడ్‌కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి- , మహిళా సాధికారత, ఈటిఓ మోటార్స్ అధ్యక్షులు అజ్మీరా బాబీ- తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News