Monday, January 20, 2025

70వేల ‘డబుల్’ ఇళ్లు

- Advertisement -
- Advertisement -

Distribution of 70000 double bedroom houses to poor in Greater soon

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పంపిణీ

వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు
ప్రతి సంక్షేమపథకం పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్షం
ప్రభుత్వ కొలువులు కావాలనేకునేవారు, సిఎం కెసిఆర్ మాటను నమ్మేవారు దరఖాస్తు చేసుకోవాలి, లేనివారు ప్రధాని మోడీ చెప్పిన పకోడి కొలువులవైపు వెళ్లొచ్చు
కెసిఆర్ ఎంతో ముందుచూపుతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నారు
వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.900కోట్లతో 60పనులు చేపడుతున్నాం
హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆసరా పెన్షన్‌లో భాగంగా 57 ఏళ్ల నిండిన వారికి వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్లను అందించనున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపుతో సహా ప్రభుత్వ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే గ్రేటర్‌లోని పేదలకు 70వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశామన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ రూ.738.59 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు ముందుగా మల్లాపూర్‌లోని రూ.4.08కోట్ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమాన స్థాయిలో అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకం పేదవారి ఆర్ధిక అభివృద్ధికి అండగా నిలిచే విధంగా ప్రతి అభివృద్ధి ఫలాలు అందరికి సమాన స్థాయిలో అందాలన్నదే ప్రభుత్వ లక్షమమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునే వారు, సిఎం కె.చందశేఖరరావును మాటను నమ్మేవారు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని నమ్మని వారు ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపే పకోడి కొలువుల వైపు వెళ్లొచ్చని పురపాలక పట్టణాభివృద్ధి కెటిఆర్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతో హైదరాబాద్ నగరంలో ఫ్లైైఓవర్లు, అండర్ పాసులు, వైకుంఠ ధామాల చేపట్టడం ద్వారా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జూబ్లీహిల్స్ వైకుంఠధామం తరహా గ్రేటర్లో రూ.49.24 కోట్ల వ్యయంతో 34 అందుబాటులోకి తీసుకువచ్చామని, మిగిలిన మరో 5పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. వర్షాల కారణంగా కాలనీల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి సుమారు రూ.900 కోట్ల వ్యయంతో 60 పనులు చేపడుతున్నామని ఇందులో జిహెచ్‌ఎంసి పరిధిలో 37పనులు చేపట్టామని ఇవి వర్షకాలంలోపు పూర్తి కానున్నాయని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

అదేవిధంగా మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యకు దీటుగా జూన్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది పనులతో హైటెక్ సిటీకి దీటుగా ఉప్పల్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ఇక్కడ నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా చెక్ పడనుందని వెల్లడించారు. అనంతరం ఆయన నాచారం వద్ద రూ.411 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న17.59 ఎంఎల్‌డి సామర్థం గల ఎస్‌టిపికి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎస్‌ఆర్‌డిపి ద్వారా రూ.311 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ వద్ద చేపట్టనున్న ఫ్లైైఓవర్‌కు శంకుస్థాపన చేయడంతో ఉప్పల్ చౌరస్తాలో రూ.2.17కోట్ల వ్యయంతో నిర్మించిన థీమ్ పార్క్‌ను ప్రారంభించారు.

అక్కడి నుంచి రామంతపూర్‌కు చేరకున్న మంత్రి కెటిఆర్ పెద్ద చెరువు నుంచి చిన్న చెరుకు వరకు ఎస్‌ఎన్‌డిపి కింద రూ.10.34 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News