Friday, December 20, 2024

‘చీరల’ పండుగ

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

కోటి చీరలను
అందచేయనున్న
ప్రభుత్వం
10 రంగుల్లో
240 రకాల త్రెడ్
బోర్డర్‌తో చీరలు
తయారీ మొత్తం
రూ.339.73 కోట్ల్లు
వెచ్చించిన ప్రభుత్వం
బతుకమ్మ చీరలతో
నేతన్నల జీవితాల్లో వెలుగులు : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి ఆడపడుచులకు బతుకమ్మ కానుకలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు ప్రభుత్వం ప్రేమపూర్వకంగా చీరలను అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు, మహిళలకు చీరలను చిరుకానుకగా ఇవ్వాలన్న ఉధాత్తమైన లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహిళల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు, రంగులు గల చీరలను పంపిణీ చేస్తోంది. ఈ సంవత్సరం కూడా మరింత ఆకర్షణీయమైన చీరల పంపిణి కార్యక్రమాని కార్యక్రమం గురువారం నుంచి శ్రీకారం చుడుతోంది.

ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సుమారు కోటి బతుకమ్మ చీరలను పంపణి చేయనున్నట్లు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కంటే ఈ సంవత్సరంలో మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వైరైటీల్లో చీరలను రాష్ట్ర టెక్స్‌టైల్స్ శాఖ తయారు చేసిందన్నారు. గ్రామల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు అభిప్రాయాలు, అసక్తులు, నిఫ్ట్ డిజైనర్లలతో సహకారంతో సరైన డిజైన్‌లు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరల నూతన డిజైనులతో ఉత్పత్తి చేశామన్నారు. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో తయారు చేయబడిన 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందన్నారు.

6 మీట్లర్ల(5.50 + 1.00) మీటర్ల పొడవుగల 92.00 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించడం జరిగిందని కెటిఆర్ వివరించారు. మొత్తంగా కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డ్ కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందిచనున్నట్లు తెలిపారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా (ఈసంవత్సరం కలుపుకుని) సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా అందించామని కెటిఅర్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణి ప్రారంభం అవుతందని కెటిఆర్ పేర్కొన్నారు. చీరల పంపీణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని…దీంతో. వారి వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు. తద్వరా వారికి ఆర్ధిక చేయూత లభించిందన్నారు. సొంతంగా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారన్నారు.

కేంద్రం నేతన్నలను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తోంది

సరైన ఉపాధి లేక జీవనం కొనసాగించడమే కష్టంగా మారిన నేతన్నల జీవితాలను బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే…. జిఎస్‌టి పన్నులతో కేంద్రం వారిని నిలువునా ముంచే చర్యలను చేపడుతోందని మంత్రి కెటిఆర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే అంతంత మాత్రంగా పని దొరకడంతో నేతన్నులు ఆర్ధికంగా చితికిపోతున్నారన్నారు. అలాంటి వారికి చేయూత నివ్వాల్సిన కేంద్రం…అందుకు విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటూ మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. వారికి సంవత్సరమంతా ఉపాధి ఇవ్వాలన్న కారణంగా బతుకమ్మ చీరలను పెద్దఎత్తున తయారు చేయిస్తున్నరన్నారు. దీంతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలతో పాటుగా ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా లభిస్తోందన్నారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకున్నా సిఎం కెసిఆర్ నాయకత్వంలో నేతన్నలకు కోసం తాము నిరంతరం నిబద్దతతో పనిచేస్తామని కెటిఆర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News