Sunday, December 29, 2024

పేద విద్యార్థులకు సైకిల్‌ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: ఎల్.యం.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యం లో నిరు పేద విద్యార్థులకు సంస్థ చైర్ పర్సన్ మంత్రి కొప్పు ల ఈశ్వర్ సతీమణి స్నేహలత సైకిల్ లను పంపిణి చేశారు. బుధవారం వెల్గటూర్ మండలం జగదేవు పేట గ్రామం లోని నిరుపేద విధ్యార్థులకు ఎల్ .యం. కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అద్వర్యం లో 20 సైకిల్ లను పంపిణి చేశారు.

ఈసందర్భంగా చైర్‌పర్సన్ కొప్పుల స్నేహలత మాట్లాడుతూ మండలం లోని జగదేవుపేట గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు కుమ్మరిపల్లి గ్రామం లోని ఆదర్శ పాఠశాలకు వెళ్లి చదుకోని ఇంటికి రావడానికి తప్పసి సరి పరిస్థతిలో వ్యయప్రాసలకు ఒర్చి చదువుకోవల్సి వస్తుందని తెలిపారు. నిరుపేద విద్యార్థుల చదువులకు గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు వారి రవాణ ఖర్చు భరించడం కష్టంగా మారిందని తెలిపారు.

అలాంటి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఎల్ యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా సైకిల్ ల నుఅందించాలని నిర్ణయం చేసుకుని ఈ రోజు అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల కు అందించిన సైకిల్ ల ద్వారా పాఠశాలలకు వెళ్లి చక్కటి చదువులు చదివి తల్లి దండ్రులకు, గ్రామానికి, ఆదర్‌వవంతగా నిలువాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ రాజేశ్వర్ రెడ్డి,వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ , మండల విద్యాధికారి బత్తుల భూమయ్య,నాయకులు కునమల్ల లింగయ్య, డా. తిరుపతి రెడ్డి ,వార్డు సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News