Sunday, January 19, 2025

ఓయూలో పోటీ పరీక్షల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థి నాయకులు

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో గిప్ట్ ఏ స్మైల్ పిలుపు మేరకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. సోమవారం బిఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆద్వర్యంలో పేద విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ అందజేశారు. అనంతరం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్ట్ కళాశాల ప్రాంగణంలో మూడు మొక్కలు నాటి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బొల్లు నాగరాజు, కడారి స్వామి యాదవ్, జంగం అవినాష్, చటారి దశరథ, జంగయ్య, రమేష్, రవి నాయక్, సిగం వెంకటేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News