Wednesday, January 22, 2025

పోలీసుల నిర్లక్ష్యంతోనే నగదు విచ్చిలవిడిగా పంపిణీ: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆపార్టీ నాయకులు సిగ్గువిడిచి ప్రచారం చేశారని, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా కనిపిస్తుందని నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉండేదని ఆరోపించారు. పోలీసు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పలువురు అభ్యర్థులు విచ్చిలవిడిగా నగదు పంపిణీ చేశారని మండిపడ్డారు. గెలుపు కోసం రాష్ట్రంలో రెండు పార్టీలు పోటీపడి డబ్బులు పంచాయని, యువత మాత్రం బిజెపికి మద్దతుగా పనిచేశారని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News