Monday, January 20, 2025

సిఎం సహయనిధి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

గట్టు : మండల పరిధిలోని తుమ్మల పల్లి గ్రామానికి చెందిన కర్రేప్ప అనే వ్యక్తి సిఎం సహయనిధికి ధరఖాస్తు చేసుకోగా రూ.18 వేలు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆదివారం లబ్ధిదారునికి చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు సిఎం సహయనిధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, ధరూర్ సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News