గోషామహల్: బోనాల పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కింద గోషామహల్, మలక్‌పేట్ నియోజకవర్గాల పరిధిలోని 178 ఆలయాలకు రూ.59.96 లక్షల రూపాయలను ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది ఈ మేరకు మంగళవార ం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్‌కుమార్, డిప్యూటీ కమీషనర్ రామకృష్ణలతో పాటు గోషామహల్ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల ఉత్సవాల సందర్బంగా దేవాలయాల నిర్వాహకులకు పండుగ నిర్వహణ నిమిత్తం చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌రాథోడ్, గోషామహల్ బీఆర్‌ఎస్ ఇం చార్జి నంద కిశోర్‌వ్యాస్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మెన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఉద్యమనేత ఆర్వీ మహేందర్‌కుమార్‌లు మాట్లాడుతూ బోనాల ఉత్స వాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలన్న ఆలోచనతో దేవాదాయ శాఖ పరిధిలో దేవాలయాలే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు తె లంగాణ ప్రభుత్వ ం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
బోనాల ప ండుగ నేపథ్యంలో ఈ సంవత్సరం దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. బోనాల పండుగ సందర్బం గా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంబంధిత అధి కారులను ఆదేశించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జి శంకర్‌యాదవ్, డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, రాకేష్‌జైస్వాల్, మాజీ కార్పోరేట ర్లు మమతాగుప్తా, పరమేశ్వరీ సిం గ్, ఎం రాంచందర్ రాజు, బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్‌గుప్తా, ఆర్ ఎ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.