Sunday, January 5, 2025

16న మైనారిటీ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం ప్రకటించిన 100 శాతం రాయితీ గల రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని తొలిదశలో ఎంపికైన 10 వేల మంది మైనారిటీ లబ్దిదారులకు ఈ నెల 16న పంపిణీ చేయనుంది. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా చెక్కుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీకి స్థల పరిశీలన జరిగింది. అవసరమైన ఏర్పాట్లను చేయడానికి శుక్రవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు.

ముఖ్యంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, మైనారిటీ సంక్షేమ శాఖ కర్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఎ. కాంతి వెస్లీ, మైనారిటీ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి షేక్ లియాకత్ హుస్సేన్ తదితరులు ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధి, అభ్యున్నతి కోసం వివిధ అనుబంధ వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తేవడం పట్ల కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాఖ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News