Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మఠంపల్లి : మండల కేంద్రంతో పాటు మండలంలోని రఘు నాథపాలెం,వర్దాపురం,చెన్నాయిపాలెం,పెదవీడు, బిల్యానాయక్‌తండా ఆరుగురు లబ్ధ్దిదారులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో మంజూరైన రూ.1లక్ష70వేలు విలువ గల సిఎం సహాయనిధి చెక్కులను సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్యతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ గడపకూ సంక్షేమ పథకాలను సిఎం కెసిఆర్ అందించారని కొనియాడారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్‌రెడ్డి, వల్లపుదాసు సురేష్, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షుడు బత్తుల సైదయ్య, అలీ,కాంతారావు, మజీద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్‌ఖాన్, బేత శివారెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News