Monday, December 23, 2024

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: అనారోగ్యంతో బాధపడుతున్న వేలాది మంది పేద మద్య తరగతి కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్న సిఎం కెసిఆర్‌కు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది బాధితులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 9 లక్షల 80 వేల చెక్కులను ఎమ్మెల్యే రసమయి బాధితులకు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆనారోగ్యానికి గురైన ప్రతి పేదవాడికి ఆర్థిక సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నిర్మల , ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేశ్ , మార్కెట్ వైస్ చైర్మన్ లకా్ష్మరెడ్డి, గుండారం ఉప సర్పంచ్ రాము, నాయకులు లక్ష్మణ్, కత్తి రాములు, కత్తి అంజయ్య, రాం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News