Tuesday, January 21, 2025

సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : జిల్లా కేంద్రంలో పెబ్బేరు పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను మంగళవారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. పట్టణానికి చెందిన ఫర్జానా బేగంకు 9వేలు, ఇందిరమ్మకు 45వేలు, కె. వెంకటేష్‌కు 42వేఉ, వైనామోని భగవంతుకు 15వేలు, ఎండి ఇమామ్ ఖాన్‌కు 10వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎండి ముస్తాక్, మైనార్టీ నాయకులు ఎండి మజీద్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రమేష్ యాదవ్, ఎండి ఖాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News