Sunday, December 22, 2024

జిహెచ్‌ఎంసి పరిధిలో వచ్చే నెల 2న డబుల్ ఇండ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీ నుంచి జీహెచ్‌ఎంసి పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో జీహెచ్‌ఎంసి కమిషనర్, కలెక్టర్‌తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో 8 ప్రాంతాల్లో 12వేల మంది అర్హులకు ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 24న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో డ్రా పద్దతిలో అబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు. పేద ప్రజలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నదని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News