Monday, January 27, 2025

జోగినిలకు నిత్యవసర సరుకుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్‌లో శుక్రవారం ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగినిలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి బుల్లెట్ రాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం జోగిని వ్యవస్థను సమూలంగా నిర్మూలించిందన్నారు. గతంలో జోగినీలుగా మారిన మహిళలకు ప్రభుత్వం నెలనెలా పెన్షన్ అందజేస్తూ వారికి ఆసరాగా నిలిచిందన్నారు. సమాజంలో జోగిని వ్యవస్థను కూకటి వెళ్లతో నిర్మూలించాలని, ఇంకా ఎక్కడైనా ఈ ఆచారం కొనసాగిస్తుంటే అడ్డుకొని, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

ఈ వ్యవస్థకు మూల కారణం నిరక్షరాస్యతే అని తెలిపారు. మక్తల్ నియోజకవర్గాలకు చెందిన 200 మంది జోగినిలకు ఫౌండేషన్ తరపున ఆమె నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ ఎంజిల డెవిస్, డిస్టిక్ కో ఆర్డీనేటర్ హజమ్మ, హెల్త్ డిపార్ట్‌మెంట్ శాంసంగ్, కె. నారాయణ, ఆశమ్మ, సిహెచ్‌డబ్లూ టీం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News