ఖమ్మం : ఖమ్మం నగరంలోని రోటరీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్‌లో చేతన ఫౌండేషన్, ఏకం (యుఎస్‌ఏ) వారి ఆర్థిక సహాయంతో రూ.1,57,500ల విలువల గల కృత్రిమ పాదాలను మంగళవారం ఉచితంగా 45 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కృత్రిమ పాదాలను జాగ్రత్తగా వాడుకుని ఎక్కువ కాలం వచ్చేలా చూసుకోవాలని సూచించారు. రోటరీ సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. కృత్రిమ పాదాల పంపిణీలో రోటరీ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రోటరీ ట్రస్ట్ చైర్మన్ మల్లాది వాసుదేవ్, చేతన ఫౌండేషన్ బాద్యులు, ఖమ్మం వాసులు వెనిగళ్ల అనీల్‌కుమార్, గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ గంగవరపు శంకరరావు, రోటరీక్లబ్ అధ్యక్షుడు వి.జగన్నాథం, పసుమర్తి రంగారావు, దొడ్డపనేని సాంబశివరావు, అక్బర్, పాషా, యూత్ రోటరీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ల రవికుమార్, ఏకం సబ్యులు సుకుమార్, ఉమాల సేవలను కొనియాడారు.