కొత్త ఆహార భద్రత కార్డులకు 10కేజీల చొప్పన అందజేత
పాతకార్డులకు గత నెల బియ్యంతో కలిపి 15 కేజీలు
మరో నాలుగు నెలలపాటు పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటున్న అధికారులు
హైదరాబాద్ : నగరంలో నేటి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఈసారి కొత్త ఆహార భద్రత కార్డుదారులకు కూడా అందజేస్తున్నట్లు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి పేదలు ఆకలి బాధలు పడకుండదని ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసింది. అయిన ప్రజలకు ఆర్దిక పరమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి ఉచిత రేషన్‌ను నవంబర్ నెలకు పొడిగించి ప్రతి ఒక పేద కుటుంబ ఉచితంగా బియ్యం తీసుకోవాలని ప్రకటించింది.
దీంతో నగర ప్రజలు మూడు నెలలుగా బియ్యం తీసుకుంటున్నారు. అదే విధంగా గడిచిన నెలల్లో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో వారికి కూడా ఆగస్టు నెల నుంచి కార్డులో ప్రతి వ్యక్తికి 10కిలోల చొప్పన అందజేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ పేర్కొంది. పాతకార్డు దారులకు 15కిలోల చొప్పన బియ్యం అందజేయనున్నారు. ఇప్పటికే రెండు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ కాగా, మొదటి నెలల్లో కార్డులోని యూనిట్‌కు 15కిలోల ఇచ్చినా గత నెలలో మాత్రం 10 కిలోల బియ్యం మాత్రమే అందజేశారు.
జూలైలో తగ్గించిన 05 కిలోల ఉచిత బియ్యాన్ని ఈనెలల్లో 10కిలోలు కలిపి మొత్తం 15 కిలోల చొప్పన పంపిణీ చేయనున్నారు. కొత్త, పాతకార్డులకు వరుసగా యూనిట్‌కు 10కిలోల కోటా చొప్పన నాలుగు నెలల పాటు బియ్యం ఉచితంగా ఇస్తారు. హైదరాబాద్ జిల్లాలో గతంలో 5,85, 756 తెల్ల రేషన్‌కార్డులుండగా, 21, 90, 034మంది లబ్ది పొందుతుండగా కొత్త కార్డులు 56,064 మంజూరు చేయగా వాటి ద్వారా 2. 25లక్షల మందికి లబ్ది చేకూర్చుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో నేటి నుంచి 6,41, 820 కార్డులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు.
అదే విధంగా కొత్త డీలర్లు నియమించాలని, రేషన్ పంపిణీకి పాతపద్దతిలోనే ఉచిత రేషన్ ఇచ్చే వరకు థర్డ్‌పార్టీ విధానం ప్రవేశ పెట్టాలని డీలర్లు కోరుతున్నారు. ఓటిపి విధానం ద్వారా చాలామందికి సెల్‌పోన్లు అందుబాటులో లేకపోవడం ఉన్నవారికి మెసేజ్ చూడరాకపోవడంతో వారి దగ్గర నుంచి తీసుకుని చూసేవరకు కోడ్ నెంబర్ పోతుందని పేర్కొంటున్నారు. చాలావరకు ఐరిస్‌తో పంపిణీ చేస్తున్నామని,దీంతో ఒక లబ్దిదారునికి ఐదు నిమిషాలవరకు సమయం పడుతుంది. థర్డ్‌పార్టీ ఉంటే ఒకరోజులోనే 50 నుంచి 60మందికి రేషన్ బియ్యం సులువుగా ఇస్తామని, అధికారులు తీసుకొచ్చిన కొత్త విధానాలతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.