కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలి
మీకోసం పోరాడే వాళ్లకు అండగా నిలవండి
వల్లంపహాడ్‌లో ఎంపీ బండి సంజయ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: పేదలకు కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ నియోజకవర్గంలోని వల్లంపహడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈసందర్బంగా పలువురు యువకులు బీజేపీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ఓటమి భయంతో యువకులకు వేలాది సెల్ ఫోన్లు పంచి ఓట్లేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఎన్ని జమ్మిక్కులు చేసినా యువత నమ్మరని కమలం పువ్వు గుర్తుకు ఓటేయబోతున్నారని చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే మీకోసం యుద్దం చేశానని అర్ధరాత్రి గుంజుకపోయి జైల్లో వేసినట్లు తెలిపారు. రైతుల కోసం, ఉద్యోగుల కోసం పోరాడినా తాను నాలుగున్నర ఏళ్ల పాటు మీకోసం కొట్లాడుతూనే ఉన్నానని నా కోసం కొట్లాడలేదన్నారు. నా కుటుంబం కోసం జైలుకు పోలేదని మీకోసం కొట్లాడి జైలు పాలైయ్యాయని నియోజకవర్గాల ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు.