Thursday, January 23, 2025

జిజిహెచ్‌లో రోగులకు పండ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చెందిన మహిళకు ఆయన కెసిఆర్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ప్ర భుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహాలో వైద్య సేవలందించడం జరుగుతోందన్నారు.

ప్ర భుత్వ ఆసుపత్రుల్లో అధునాతన వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోందన్నారు. కడుపు కోత లేకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ సాధారణ ప్రసవాలు చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ఎంఎల్‌సి కవిత ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కెసిఆర్ బువ్వకుండ కేం ద్రంలో రోగులకు వారి సహాయకులకు సహపంక్తి భోజన వితరణ చేశారు. ఈ కార్య క్రమంలో నుడ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర మహిళాకమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, ప్ర భుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు ప్రతిమారాజ్ రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా, డిఎంహెచ్‌ఓ సుదర్శనం , కార్పొరేటర్లు, నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News