Monday, January 20, 2025

భద్రకాళి చెరువులో చేప పిల్లల వితరణ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హనుమకొండ: మత్స్యకారులకు అన్నివిధాల అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీబజార్ మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భద్రకాళి తటాకంలో వదిలారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తదుపరి వడ్డెపల్లి, భద్రకాళి చెరువుల్లో అధికారికంగా మళ్లీ చేపల పెంపకాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో నూతన నీటి వనరుల విస్తీర్ణం భారీగా పెరగడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్యసంపద కూడా భారీగా పెరిగిందన్నారు. భద్రకాళి చెరువులో రూ.6 లక్షలతో దాదాపు 4 లక్షల చేప పిల్లల వితరణ చేయడం వల్ల రాబోయే కాలంలో దాదాపు రూ.2 కోట్ల ఆదాయం లభించనుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News