Saturday, January 4, 2025

రాజంపేటలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

రాజంపేట: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని పొందుర్తి, తలమండ్ల గ్రామాలకు చెందిన 11మంది అబ్దిదారులకు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ విఫ్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆదేశాల మేరకు ఎంపిపి స్వరూప కృష్ణముర్తి, జడ్పిటీసి కోండ హన్మండ్లు, తహసిల్దార్ శాంత లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీచెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడబిడ్డ వివాహనికి తమ వంతు సహకారంగా ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి దుబ్బని సావిత్రి, మాజీ ఎంపిపి నీరుడి శంకర్, సర్పంచ్‌లు ఎనుగు విఠల్ రెడ్డి, గంగాకిషన్, ఎంపిటీసిలు బాలరాజ్‌గౌడ్, నర్మల రాజు, రాజంపేట పట్టణ బిఆర్‌ఎస్ అద్యక్షులు చింతల స్వామి, ఆర్‌ఐ సంతోష్ కుమార్, సీనియర్ అసిస్టేంట్ రేఖ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News