Monday, December 23, 2024

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

చేగుంట: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావులు పంపిణీ చేశారు. పోమవారం తహసీల్దార్ శ్రీనివాస్ చేగుంట మండలానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడులకు వివాహ ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందని అదే విదంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కుల వృత్తుల వారికి, మైనార్టీ వారికి 1 లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాసుల శ్రీనివాస్, వైస్ ఎంపిపి మున్నూర్ రామచంద్రం, చేగుంట మండల సర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపిటిసి అయిత వెంకటలక్ష్మి రఘురాములు, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్‌రెడ్డి లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసొలు కలసి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News