Wednesday, January 22, 2025

తల్లి బిడ్డకు వరం.. కెసిఆర్ న్యూట్రీషియన్

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మండల కేంద్రంలోని పిహెచ్‌సీలో ప్రారంభించారు. పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. అర్జున్ నాజీరా ఆద్వర్యంలో చేపట్టారు. ముఖ్య అథితులుగా ఎంపిపి గైని అనసూయ రమేష్, జడ్‌పిటిసీ కమ్లి నర్సింలు సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపిపి గాదారి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎంపిటిసీ పాపనోల్ల బీరయ్య, డిప్యూటి డియం అండ్ హెచ్‌ఓ డా. ఇద్రీస్ ఘోరి, టిఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షుడు బొలిపల్లి మహెందర్ రెడ్డి,సింగిల్విండో అద్యక్షుడు కమలాకర్ రావు,ఏఎంసీ వైస్ చైర్మన్ వడ్ల రాజెందర్, మండల కోఆప్షన్ సభ్యుడు యండి అల్తాఫ్ గర్భవతులకు కిట్లను అందజేసారు.

ఈ సందర్భంగా ఎంపిపి,జడ్‌పిటిసీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళ ఆరోగ్య భద్రతకు కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తల్లికి పౌష్టికాహారంతో పాటు శిశువుకు ఆరోగ్యం కల్పించడానికి న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించి మహిళల ఆశ్వీర్వాదం పొందుతున్నారని అన్నారు. డా. అర్జుమన్ నాజీరా గర్భవతులకు న్యూట్రీషియన్ వాడే విధానం వివరించారు. ఆసుపత్రి సిహెచ్‌ఓ నాగరాజు న్యూట్రీషియన్ కిట్ల ఉపయోగం, అందులోని పౌష్టికాహారం వివరాలను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అద్యక్షుడు పెసరి సాయిలు, ఉత్తునూర్ ఎంపిటిసీ రాంచెందర్ రావు, రవీందర్ రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News