Wednesday, January 22, 2025

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

- Advertisement -
- Advertisement -

మంచాల: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని అబ్దుల్లాపూర్ మేట్ మండల బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు గుండె శ్రీనివాస్ అన్నారు. సోమవారం తన జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని దాద్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం, మతం, జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయుడు ఎన్ యాదగిరి, ఉపాధ్యాయులు ఎం రాములు, కె లలిత, వి మహాలక్ష్మి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News