Friday, December 20, 2024

విద్యార్థినులకు ఎన్‌టిపిసి 9 శానిటరీ వెండింగ్ యంత్రాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: అతి చిన్నదైన రుతుస్రావ కారణం విద్యార్థినుల విద్యకు అవరోధం కారాదని ఎన్‌టిపిసి ఆర్‌ఈడి (సౌత్) దేబాశిష్ చటోపాధ్యాయ అన్నారు. కార్పొరేట్ సామాజిక భధ్రత కార్యక్రమంలో భాగంగా ఎన్‌టిపిసి ఎస్‌ఆర్‌హెచ్‌క్యూ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్ధినులకు మొదటి దశకింద 9 శానిటరీ వెండింగ్ యంత్రాలతోపాటు 5వేల శానిటరీ ప్యాడ్లను ఇన్సినరేటర్లను మంగళశారం ఎన్‌టిపిసి కార్యాలయంలో దేబాశిష్ చటోపాధ్యాయ జిల్లా ఎంఈఒ ఎస్. చిరంజీవి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చటోపాధ్యాయ మాట్లాడుతూ పాఠశాలలో పరిశుభ్రత చాలా అవసరమన్నారు.

తద్వారా బాలికలు నాణ్యమైన ఉచిత వి ద్యను అవిచ్ఛనంగా పొందగలరని తెలిపారు. ఎస్‌ఆర్‌హెచ్‌క్యూ జిఎం (హెచ్‌ఆర్) ఎస్.ఎన్ పాణిగ్రాహి మాట్లాడు తూ ముఖ్యమై న రంగాల్లో ఒకటి ఆరోగ్య విద్య, పారిశుధ్యమని అందులో భాగమే ఈ కార్యక్రమని తెలిపారు. రెండో దశలో మరిన్ని పాఠశాలలు, కళాశాలలకు వీ టిని పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంఈఓ ఎస్. చిరంజీవి మాట్లాడుతూ బాలకల విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుక ఎన్‌టిపిసి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News