మనతెలంగాణ/హైదరాబాద్: మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కెసిఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కెసిఆర్ న్యూట్రీషన్ కి ట్లకు రూపకల్పన చేసింది. ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేర కు బుబుధవారం నుంచి 9 జిల్లా ల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇ ప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చే సింది. కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు… స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎం ఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధు లు పాల్గొంటారు.
రాష్ట్రంలో అ త్యధికంగా ఎనీమియా (రక్త హీ నత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం, జయశంకర్ భూపాలపల్ల్లి, జోగులాంబ గద్వాల, కామారె డ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అంచనాల ప్రకారం 1.25 లక్షల మంది గర్బిణీలకు ఈ పథకం ఉపయోగపడనుంది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నది.
ఎనీమియా నుంచి విముక్తి..
రక్త హీనత (ఎనీమియా) గర్బిణుల పాలిట శాపంగా మారుతున్నది. గర్బిణులకు ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది. ఈనెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను కెసిఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నది. తొలిదశలో భాగంగా గర్బిణుల్లో ఎనీమియా ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది.
రక్తహీనత తగ్గించడమే లక్ష్యం
ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లను పోష్కాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఒక్కో కిట్‌ను రూ. 1,962తో రూపొందించి,ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తున్నది. 13 నుంచి -27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్ సమయంలో ఒకసారి, 28 నుంచి -34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వనున్నారు. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తున్నది.
గర్బిణులకు వరంగా కెసిఆర్ న్యూట్రీషన్ కిట్లు
మాతా శిశు సంరక్షణలో భాగంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు 13,90,634 మంది లబ్దిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. రూ. 1261.61 కోట్లను ఆర్థిక సాయం కింద ప్రభుత్వం డిబిటి ద్వారా ఖాతాల్లో జమ చేసింది. ఇలా కెసిఆర్ కిట్ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1,500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 శాతంగా ఉన్న ప్రసవాలు గణనీయంగా పెరిగి, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. ఇదే సమయంలో అనవసర సి- సెక్షన్ల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తున్నది. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కెసిఆర్ న్యూట్రీషన్ కిట్లు గర్బిణులకు వరంగా మారనున్నాయి.
కిట్‌లో ఏముంటాయి?
1. కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
2. కిలో ఖర్జూర
3. ఐరన్ సిరప్ మూడు బాటిల్స్
4. 500 గ్రాముల నెయ్యి
5. ఆల్‌బెండజోల్ టాబ్లెట్
6. కప్పు
7. ప్లాస్టిక్ బాస్కెట్
జిల్లాలవారీగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు ప్రారంభించనున్న మంత్రుల వివరాలు
జిల్లా – మంత్రి
ఆదిలాబాద్ – ఇంద్రకరణ్ రెడ్డి
కుమురంభీం ఆసిఫాబాద్ – బాల్క సుమన్, ప్రభుత్వ విప్
భద్రాద్రి కొత్తగూడెం – పువ్వాడ అజయ్
ములుగు – సత్యవతి రాథోడ్
జయశంకర్ భూపాలపల్లి – ఎర్రబెల్లి దయాకర్ రావు
వికారాబాద్ – సబిత ఇంద్రారెడ్డి
నాగర్ కర్నూల్ – శ్రీనివాస్ గౌడ్
గద్వాల్ – నిరంజన్ రెడ్డి