Monday, January 20, 2025

రైతులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

Distribution of Rythubandhu from June 28th

వానాకాలం సాగు పెట్టుబడి నిధుల విడుదలకు
సిఎం ఆదేశం

2022-23 బడ్జెట్‌లో రూ.14,800 కోట్లు
కేటాయింపు తొమ్మిదో విడతగా
వానకాల పంట సాగుకు రూ.7,500 కోట్లు
64లక్షల మంది రైతుల
ఖాతాలకు నిధులు జమ
ఎకరం రైతు నుంచి పంపిణీ ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్ : చల్లటి వాతావరణంలో రాష్ట్ర రైతాంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం తియ్యటి కబురందించింది. వానాకాల పంటల సాగుపెట్టుబడి రైతుబంధు పథకం కింద నిధులు విడుదల చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. ఈ నెల 28నుంచి రై తుల ఖాతాలకు నిధులు జమను ప్రారంభించాలని సిఎం ప్రభుత్వ ప్రధాన సోమేష్ కుమార్‌ను ఆదేశించడంతో బుధవారం నుంచే రైతు పంపిణీకి సబంధించిన ప్ర క్రియపై ఆర్థిక, వ్యవసాయశాఖలు కసరత్తులు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి రైతుబంధుపథకం కోసం బడ్జెట్‌లో రూ.14800కోట్లు కేటాయించింది. ఈ నిధుల నుంచి వానాకాలం పంటల సీజన్‌కు సబంధించి రూ.7500కోట్లు రైతుబం ధు కింద జమ చేయనున్నారు. ఈ నెల 28 నుంచి నిధుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అవసరమై ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వానాకాల సీజన్‌కు సం బంధించి 147.21లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. రైతుబంధు పథకం కింద అర్హత పొందిన 63,25,695మంది రైతులకు నిధులు పంపిణీ చేయనున్నారు. ఎకరానికి రూ.5000చొప్పున పంటల పెట్టుబడికి ప్రభుత్వం సాయం అందించనుంది.

తొలుత ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులనుంచి నిధుల జమ ప్రారంభం కానుంది. వరుస క్రమంలో తొలిరోజు ఎకరం రైతులకు , రెండవ రోజు రెండు ఎకరాలు ఆలోపు ఉన్న రైతులకు మూడవ రోజు మూడు ఎకరాలు ఆలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు ఈ విధంగా రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోనున్నారు. దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తోంది. 2018నుంచి ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ 8విడుతలలో రూ.50,447కోట్లు రైతులకు అందజేసింది. రైతుబంధు పథకం కింద గత వానాకాలంలో 60.84లక్షల మంది రైతులకు రూ. 7360.41కోట్లు సాయం అందించింది.యాసంగి సీజన్‌లో 63లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7412.53కోట్లు జమ చేసింది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పన్నుల రాబడి తగ్గినప్పటికీ రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది.

ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్పప్పటికీ రైతుబంధుకు నిధుల విడుదలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో అధికార యంత్రాంగం కూడా ఈ పధకం అమలు పట్ల ప్రతేక శ్రద్ద తీసుకుంటోంది. అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఈ పథకం ద్వారా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ అవుతున్నాయి. గత ఏడాది వానాకాలం సీజన్‌లో జూన్ 13న ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయగా ఈ ఏడాది జూన్ ముగిసేలోపే నిధుల పంపిణీకి చర్యలు తీసుకున్నారు.

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి:

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ 28నుంచి ఈ పథకం కింద నిధుల పంపిణీకి అన్నిఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News