Monday, December 23, 2024

గొల్ల కురుమల ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధనకే గొర్రెల పంపిణీ

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

హసన్‌పర్తి: గొల్ల కురుమల ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధనకే గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ రాంపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రూ. 21 లక్షల విలువ చేసే 12 యూనిట్ల గొర్రెలను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీతో, 25 శాతం లబ్ధిదారుని వాటాతో గొర్రెలను లబ్ధిదారులకు అందచేస్తున్నామన్నారు. మాంసం ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని, తెలంగాణ రాష్ట్రంలో మాంసం దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందన్నారు. గొర్ల కాపారులు గొర్రెలను మంచిగా పెంచి, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గొర్రె కాపారులు ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకొని ఆర్థికంగా బలపడే విధంగా గొర్రెల పెంపకం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ఇండ్ల నాగేశ్వర్‌రావు, పీఏసీఎస్ ఛైర్మన్ ఊకంటి వనంరెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News