- రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి: గొర్రెల పంపిణీ సిఎం కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అని, గొల్లకురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్షంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండల పరిధిలోని కొత్లాపూర్‌లో గొల్లకురుమలకు 6యూనిట్‌ల గొర్రెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సిఎం కెసిఆర్ పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని గొర్రెల పంపిణీ పథకం కేవలం తెలంగాణాలో మాత్రమే ఉందని, గొర్రెల పంపిణీతో గొల్లకురుమలు ఆర్థిక పరిపుష్టి పెంచిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్షాలు ఓర్వ లేక ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సందీప్, మాజీ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మనోహర్‌గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు దశరథ్, మోహన్ నాయక్ తదితరులున్నారు.