Monday, January 20, 2025

ఆటోడ్రైవర్‌ భార్యకు ఎస్‌ఆర్ ట్రస్టు బీమా చెక్కు పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎస్‌ఆర్ ట్రస్టు ద్వారా ఓ నిరుపేద కుటుంబానికి ధీమా లభించింది. పఠాన్‌చెరు నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు ఎస్‌ఆర్ ట్రస్టు ద్వారా గోదావరి అంజిరెడ్డి దంపతులు అమలు చేస్తున్నారు. బొల్లారానికి చెందిన ఆటో డ్రైవర్ పూజారి రాము భార్య పూజారి సరస్వతికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రూ. 20 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, బిజెపి బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ శ్రీకాంత్ యాదవ్, సాయి కిరణ్ రెడ్డి, మల్లేష్ భూపాల్ రెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News