Sunday, January 12, 2025

50 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీల పంపిణి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: దివ్యాంగుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆదివారం 50 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా దివ్వాంగులకు 1,0,4000 రూపాయల విలువైన ట్రై స్కూటీలను అందిస్తుందని తెలిపారు. సిఎం కెసిర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్వాంగులకు రూ. వేల ఫించన్ ప్రతి నెలా అందిస్తున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారుగా ప్రగల్బాలు చెబుతున్న బిజేపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు కేవలం రూ. 500 నుంచి 600 మాత్రమే ఫించన్లు ఇస్తున్నారన్నారు.

వికలాంగుల స్వయం ఉపాధి కోసం లక్ష రూపాయల రుణాలను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు మూడు లక్షల రూపాయలు నుంచి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సిఎం కెసిఆర్ వికలాంగుల సంక్షేమానికి పని చేస్తున్నారని కొంత మంది సోషల్ మీడియాలో నిన్న మొన్న వచ్చి అవాక్కులు చేవాక్కులు మాట్లాడుతున్నారని వారికి మీరంతా చెంప మీద కొట్టేలా బుద్ది చెప్పాలన్నారు. బట్ట కాల్చి మీదేసే విధంగా ఇష్టారితిగా గోబెల్స్ ప్రచారం చేస్తున్న వారిని ప్రజలే తరిమికొట్టాలన్నారు. సిఎం కెసిఆర్ వల్లే నేడు వికలాంగులకు అన్ని రకాలుగా సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందుతున్న వారు కెసిఆర్‌కు అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలన్నారు. స

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News