Monday, December 23, 2024

పోడు భూముల పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:పోడు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది అని దే వరకొండ శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పొ డుభూముల పట్టాలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తీసుకున్న పోడు భూముల పట్టాల పంపిణీ నిర్ణయం యావత్ దేశానికి ఆదర్శం అని ఆయన తెలిపారు. గిరిజనుల ఏళ్ల కల నె రవేర్చిన గోప్ప నాయకుడు గౌరవ సీఎం కేసీఆర్ అని ఆ యన అన్నారు.

గిరిజన హితమే సర్కారు అభిమతం అని ఆ యన అన్నారు.దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత ప రిష్కారం చూపించి, అడవి బిడ్డలను యజమానులుగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన అన్నారు. పోడు పట్టాలతో పాటు రైతు బంధు, రైతు బీమా అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. మొత్తం 1,51,146 పోడు పట్టాదారులకు రైతు బంధు పథకం ద్వారా 406 కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఏ కారణంతో అయినా రైతు మృతి చెందితే రైతు బీమా పథకం ద్వారా 5లక్షలు ఆ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు.

పోడు పట్టాల ప ంపిణీతో అటవీ భూముల అన్యాక్రాంతానికి చెక్ పెట్టాలని స ర్కారు నిర్ణయించింది, తమ కమతాల చుట్టూ ఉన్న ఫారెస్టు భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగిస్తుంది. తద్వారా ఆక్రమణలకు అవకాశం లేకుండా కట్టడి చేయడం జరుగుతుందని అని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలోని బంజారాల, ఆదివాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటిన గొప్ప నాయకు డు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అని ఆ యన అన్నారు. దీంతో ప్రస్తుతం మొత్తం 3,146 గిరిజన గ్రా మపంచాతీలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి అని ఆయన అన్నారు. తండాలను, ఆదివాసి గూడాలను గ్రామపంచాయతీలుగా మా ర్చడంతోపాటు వాటన్నిటికీ ఒక్కొక్క జీపీ భవనాలకు 20 లక్ష ల చొప్పున మంజూరు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశా రు.

రాష్ట్రంలోని అన్ని ఆదివాసి గూడాలు, తండాలకు సు మారు రెండువేల కోట్లతో బీటీ రోడ్లను మంజూరు చేయడం జ రిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 3,467 గిరిజన ఆవాసాలకు 221 కోట్లు ఖర్చు చేసి త్రిఫిజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. 192 కోట్లు ఖర్చు తో, ఒక లక్ష, ఒక వెయ్యి గిరిజన కుటుంబాలకు 101 యూ నిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించడం జరుగుతుంది ఆయన అన్నారు. తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం అని ఆయన అన్నారు.

తెలంగాణలో గిరిజనుల గడప గడపకు సంక్షేమం కొత్త పంచాయతీల్లో కదంతొక్కే ప్రగతిపథం కొండకోనల్లోని ఇళ్లల్లో పరవళ్లు తొక్కే జలదృశ్యం గిరిజనులు ఆదివాసీల అభ్యున్నతిలో ఇదో స్వర్ణయుగం అని ఆయన అన్నారు. రాజధాని నడిబొడ్డున వెలసిన ఆత్మగౌరవ భవనాలు స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకునే నిలువెత్తు ప్రతీకలు అని ఆయన అన్నారు. గురుకులాల్లో విరబూసు ్తన్న విద్యాకుసుమాలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న స ందర్భాలు పదిశాతం వరకు పెంచుకున్న రిజర్వేషన్ ఫలాలు ప్రత్యేక ప్రగతి నిధితో మారుతున్న బతుకు చిత్రాలు అని ఆ యన తెలిపారు.

నడుస్తున్న తెలంగాణ చరిత్రలో ఇవన్నీ సువర్ణాక్షరాలే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు, రైతు బంధు అధ్యక్షుడు బో యపల్లి శ్రీనివాస్ గౌడ్, అర్వపల్లి నర్సింహ, వేముల రా జు,వాడిత్య బాలు,వంకునవత్ నాగు,ఎర్ర యాదగిరి,రమావత్ చందు, శ్రీనివాస్ యాదవ్, బొడ్డుపల్లి కృష్ణ, జటవత్ స్వామి నాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News