Thursday, January 23, 2025

డిసిసిబి చైర్మన్ఆధ్వర్యంలో వాటర్ క్యాన్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఆదివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ ఆధ్వర్యంలో డీ సీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వా టర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తెలిపారు.

ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజలు సీఎం కేసీఆర్ వెంటనే ఉంటారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటకూరి అనురాధ, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నేతలు కసావు శ్రీనివాస్, తదితరు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News