మన తెలంగాణ/గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో అన్యాక్రాంతమవుతున్న భూములపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. అన్నారం తాజా మాజీ సర్పంచ్ తిరుమల వాసు,రైతుల ఫిర్యాదు మేరకు 261 సర్వే నంబర్ లోని 588 ఎకరాల్లో 271ఎకరాల భూమిని సర్వే చేసి రైతులకు రావాల్సిన 117 ఎకరాలను ఆన్ లైన్ చేసి పక్కా సర్టిఫికెట్లను అందజేస్తామని,సర్వేకు రైతులు సహకరించాలని నిన్న అన్నారం గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విరా రెడ్డి కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్నారం గ్రామ పరిధిలోని 261 సర్వే నం బర్ లోని 588 ఎకరాల్లో 273 ఎకరాల భూ పం పిణీ చేయడం జరిగింది.117 ఎకరాలకు సంబంధించి రైతులకు 1985 లో సర్టిఫికెట్లను అందజేశారు.2017లో వీటికి సంబంధించి పొజిషన్ కూడా రైతులకు చూపించడం జరిగింది.పట్టా పాస్ బుక్ లు మాత్రం రైతులకు అందలేదు. ఎక్స్ సర్వీస్మెన్ లకు కేటాయించిన 119 ఎకరాల్లో 45 ఎకరాలు మిగులు భూమి ఉంది.
కారణం వీటిలో 75 ఎకరాలు మాత్రమే ఎక్స్ సర్వీస్ మెన్ కబ్జాలో ఉన్నారు. రైతులకు సంబంధించిన 117 ఎకరా లు ఎక్స్ సర్వీస్మెన్ చెందిన 119 ఎకరాలు మొత్తం 236 ఎకరాలు మాత్రమే లెక్కల్లో ఉంది. ఇవి కాక అదే 273 ఎకరాల్లో 17 ఎకరాలు ఇందిరమ్మ ఇళ్లకు,8 ఎకరాలు తెలంగాణ కాలనీ కి కేటాయించగా 10.5 ఎకరాలు వావిలాల చెరు వు శిఖంలో ఉంది. ఇదేమైనా ప్రభుత్వ భూమి మీద అయిన 273 ఎకరాల్లో సర్వీస్ మెన్ లకు కేటాయించిన 119 ఎకరాల్లోని 44 ఎకరాలకు సంబంధించిన లె క్క తేలాల్సి ఉంది.ఇదే సభ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డిని మిగతాప్రభుత్వ అధికారులను రైతులకు సంబంధించిన 117 ఎకరాలకు సర్టిఫికేట్లను అందజేసినా ఫొజిషన్లు చూపకపోవడంతో రైతులు తమకు న్యాయం చేయమని కోరడం జరిగింది.
దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను వెంటనే సర్వే నిర్వహించి రెండు రోజుల్లో రైతులకు వారి పొజిషన్లను చూ పించాలని ఆదేశించడం జరిగింది. ఇద్దరు సర్వేయర్లతో రెండు రోజుల్లో సర్వే చేయించి సర్వే నివేదికలను కలెక్టర్ కు అందజేస్తామని, సర్వే కు రై తులు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ వీ రారెడ్డి కోరారు.సర్వే అనంతరం గ్రామ పం చాయతీలోనే మీ సేవా కేంద్రాన్ని ఏర్పా టు చేసి ఆన్ లైన్ చేయించి సర్టిఫికేట్లను రైతు పట్టా పాస్ పుస్తకాల ను ఈ నెల 12 వ తేదీ లోపు అందజేస్తామని హా మీనిచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన రైతులు ఈ నిర్ణయాన్ని అంగీకరించారని వారు అ న్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో పా టు ఆర్డీఓ నగేష్, డీపీఓ సురేష్ మో హన్, డీఎల్ పీఓ సతీష్ రెడ్డి, తహశీల్దార్ సుజాత, గ్రామ సర్పంచ్ తిరుమల వాసు ఉపసర్పంచ్ ము రళి ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యులు రాజకీయ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.