Thursday, April 3, 2025

అకారణంగా రోగులను బయటకు పంపితే చర్యలు .. జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా

- Advertisement -
- Advertisement -

సంగారెడి : ఆసుపత్రిలోని పరికరాలను వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు. మంత్రి హరీష్‌రావు ఆదేశం మేరకు సోమవారం  పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తనిఖి చేశారు. గర్భిణులను బయటకు పంపుతున్నారని ఆసుపత్రి పై ఆరోపణలు వచ్చాయని, అకారణంగా రోగులను బయటకు పంపితే చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రసూతి సేవల పై ఆరా తీశారు. పొరుగు సేవల సిబ్బంది డ్రెస్ కోట్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News