Friday, January 17, 2025

పోడుపై జిల్లా సమన్వయ కమిటీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : పోడు భూముల అంశంపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా అధి కారులు, మంత్రులు, శాసనసభ్యులతో పో డు భూముల సాగుకు జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు జి ల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహ రిస్తారు. పొడు భూముల అంశంపై జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా ఎస్‌పి/ పోలీస్ కమిషనర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, డిఆర్‌డివో, డిటిడివో ఈ కమిటీలో అధికారిక సభ్యులుగా ఉంటారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులు చేశారు. ఇతరులను కూడా అవసరం మేరకు ఆహ్వానించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో అడవులను సంరక్షించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుంది. పోడు భూముల కింద రిజిస్టర్ అయిన భుముల వివరాలను పరిశీలిస్తుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు చేపడతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News